ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం కేంద్రకేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నాలుగో దశ లాక్‌డౌన్‌పై చర్చలు జరగనున్నాయి. ఇటీవల రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎక్కవ మంది సీఎంలు లాక్‌డౌన్ కొనసాగించాలని కోరారు. దీంతో మంగళవారం నాలుగో దశ లాక్ డౌన్ ఉంటుందని మోదీ ప్రకటించారు. అయితే.. కరోనా కట్టడికి లాక్ డౌన్ కొనసాగిస్తూనే.. ఆర్ధిక వ్యవస్థ గాడిలో పెట్టేందుకు.. పరిశ్రమలు నడిపించాల్సిన అవసరం ఉంది. ఈ విదంగా ముందుకు పోవాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.