కరోనా కారణంగా దైవదర్శనాలు రద్దు చేసిన మోదీ ప్రభుత్వం మద్యం దుకాణాలకు మాత్రం అనుమతి ఇచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీఐ నారాయణ. ఎక్కడైతే క్రమశిక్షణ ఉన్నారో అక్కడ.. లాక్‌డౌన్ ఉల్లంఘించేలా అనుమతులు ఇచ్చారంటూ విమర్శించారు. ఇన్ని రోజులుగా ప్రజలు ఎంతో క్రమశిక్షణగా లాక్‌డౌన్ పాటించారన్నారు. అయితే మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చి ఇన్నాళ్ల లాక్‌డౌన్‌ను వృథా చేశారన్నారాయన.
అంతకు ముందు.. లిబర్టీలోని తిరుపతి తిరుమల దేవస్థానాన్ని సందర్శించారు నారాయణ. అయితే.. ఆలయం తలుపులు మూసి ఉండటంతో.. లోనికి వెళ్లలేకపోయారు. ఆ తర్వాత.. హిమాయత్‌నగర్ మెయిన్‌రోడ్డులో ఉన్న ఓ వైన్స్‌షాప్‌నూ సందర్శించారు. గుడి మూసి ఉండటం వైన్‌షాపు మాత్రం తెరిచి ఉండంటంతో ఆవేదన వ్యక్తం చేశారు.