ఆరోగ్యంగానే ఉన్నాడు.. అయినా కరోనాతో మరణించాడు

Update: 2020-05-13 22:17 GMT

కరోనా వైరస్ 28ఏళ్ల జపనీస్ సుమో రెజ్లర్‌ షోబుషిని బలి తీసుకుంది. ఈ క్రీడలో వైరస్ బారిన పడిన మొదటి వ్యక్తి అతడు. ఏప్రిల్ 10న అతడు కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. రిపోర్ట్ పాజిటివ్ అని తేలడంతో ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకున్నాడు. పది రోజులు ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నాడు. నెల రోజులకు పైగా కరోనాతో పోరాడాడు. ఒక మల్లయోధుడు వలే వైరస్‌తో ధైర్యంగా పోరాడాడు. కానీ చివరకు కరోనా చేతిలో ఓడిపోయాడు. జపాన్‌లో వైరస్ బారిన పడి అతి చిన్న వయసులో మరణించిన వ్యక్తి ఇతడు. ఇప్పడి వరైరస్ బాధితులు అధిక శాతం 50 ఏళ్లు పై బడిన వారే. టోక్యోలో 90 శాతం కంటే ఎక్కువ ఆసుపత్రులు అన్నీ కోవిడ్ కేసులతో నిండిపోయాయి. జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం 2000 పడకల్లో1,832 పడకలు ఇప్పటికే నిండి ఉన్నాయి. కాగా, జపాన్‌లో కరోనా పాజిటివ్ కేసులు 15,968 ఉండగా 657 మంది మరణించారు.

Similar News