మాస్క్ ధరించకపోతే జరిమానాతో పాటు జైలు శిక్ష..

Update: 2020-05-16 17:40 GMT

గల్ఫ్ దేశాల్లో నిబంధనలు అసలే కఠినంగా ఉంటాయి. ఎవరైనా రూల్స్ ఉల్లంఘించారో వాళ్లని ఉరి తీయడానిక్కూడా వెనుకాడరు. కోవిడ్ వ్యాప్తి నిర్మూలనకు భౌతిక దూరంతో పాటు, మాస్క్ కచ్చితంగా పెట్టుకోవాలి. వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు ఖతార్ ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం ఒక్కరోజే 1,733 కేసులు నమోదు కావడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. ముఖానికి మాస్క్ ధరించకుండా బయటకు వస్తే 200,000 రియాల్స్ (సుమారు రూ.42 లక్షలు) జరిమానాతో పాటు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. 2.75

మిలియన్ జనాభా ఉన్న ఖతార్లో 28,000 మంది కరోనా బారిన పడ్డారు. 14 మరణాలు సంభవించాయి. వైరస్ వ్యాప్తిని నిర్మూలించే దిశగా బార్‌లు, రెస్టారెంట్‌లు, సినిమా థియేటర్లు, మసీదులను మూసివేశారు.

Similar News