కరోనా వైరస్‌కు టీకా అంత త్వరగా రాదా?

Update: 2020-05-18 20:12 GMT

టీకా వస్తుంది... కరోనా చస్తుంది అనేది అందరి ఆశ. కానీ బ్రిటన్, ఇటలీ ప్రధాన మంత్రుల ప్రకటనలు ఈ ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయి. కరోనాను నివారించే వ్యాక్సిన్ అంత త్వరగా రాకపోవచ్చని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఇటలీ ప్రధాని గిసెప్సీ కొంటె నిట్టూర్చారు. వైరస్‌తో కలిసి ముందుకు సాగాల్సిందేనని తేల్చేశారు. ఈ మహమ్మారి సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. దీన్ని గాడిలో పెట్టాలంటే లాక్‌డౌన్‌ను ఎత్తేసి, వ్యాపార కార్యకలాపాలను చేపట్టాల్సిందేనని ఈ ఇద్దరు ప్రధానులు వ్యాఖ్యానించారు. లోకల్ లీడర్స్ నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ కంటే ముందే ఆంక్షలను సడలించాలని గిసెప్సీ కొంటె నిర్ణయించారు. దీంతో ఇటలీలో రెస్టారెంట్లు, బార్లు, బీచ్‌లు తెరుచుకోనున్నాయి.

ఇక ఇప్పటికే కరోనా కోరల్లో చిక్కి బయటపడిన బోరిస్ జాన్సన్ టీకాపై ఆశ వదులుకోవల్సిందే అనే రీతిలో వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ ఎప్పటికీ అందుబాటులోకి రాకపోవచ్చని ఆయన అన్నారు. టీకా కోసం వేచి చూడకుండా వైరస్‌తో కలిసి జీవించడం తప్ప మరోదారి లేదన్నారు.

Similar News