కంటైన్మెంటు ప్రాంతాలు మినహా తెలంగాణలో మిగిలిన్నవీ గ్రీన్ జోన్లే అన్నారు సీఎం కేసీఆర్. లాక్ డౌన్‌పై కేంద్రం మార్గదర్శకాలను పాటించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. దుకాణాలతోపాటు పరిశ్రమలు, కంపెనీల కార్యకలాపాలకు పచ్చజెండా ఊపింది.. నియంత్రిత సాగే బాగన్న సీఎం కేసీఆర్.. పంటల సాగుపై రైతులకు పలు సూచనలు చేశారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపైనా ఘాటుగా స్పందించారు.. కేంద్రం ప్యాకేజీ అంతా బోగస్ అని దుయ్యబట్టారు. ఇక పోతిరెడ్డిపాడు వివాదంపైనా సీఎం కేసీఆర్ స్పందించారు.. నిబంధనల మేరకే ప్రాజెక్టులు కట్టుకున్నామని చెప్పారు.