వైరస్ వస్తుంది.. పోతుంది.. : సీఎం జగన్

Update: 2020-05-20 14:09 GMT

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ప్రారంభం కావాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. షాపింగ్ కాంప్లెక్సులు, మాల్స్, సినిమా థియేటర్లు, మతపరమైనా కార్యక్రమాలు, సదస్సులు తప్ప మిగిలిన చోట్ల కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలి. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది మార్చి వరకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కేలెండర్‌ను ఆయన విడుదల చేశారు. రెండు మూడు రోజుల్లో రవాణా వ్యవస్థ ప్రారంభమవుతుందని అన్నారు.

మాస్కులు ధరించి, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. లాక్డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్థమైంది. సాధారణ పరిస్థితులు నెలకొనే చర్యలు చేపట్టాలి. సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేయాలన్నారు. రానున్న రోజులు కోవిడ్‌‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఉంటుందని పునరుద్ఘాటించారు. భవిష్యత్తులో కరోనా సోకని వారు వుండరు. అది వస్తుంది పోతుంది. వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కలింగించాలని.. ఎవరికి వారే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని అన్నారు.

Similar News