వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలిస్తున్న శ్రామిక్ రైళ్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఇరు రాష్ట్రాల పరస్పర అంగీకారంతో వలస కార్మికులను తరలించాలని నిబందనలు ఉండేవి.. కానీ, వాటిని సవరించి.. ఆయా రాష్ట్రాల అంగీకారం లేకపోయినా.. కార్మికులను తరలించవచ్చని ప్రకటించింది. శ్రామిక్ రైళ్ల విషయంలో పలు రాష్ట్రాలు.. తమ రాష్ట్రంలోని అనుమతించటంలేదని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో కేంద్ర ఈ కీలక నిర్ణయం తీసుకుంది.