డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత్‌కు స్థానం

Update: 2020-05-19 21:04 GMT

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత్ భాగమైంది. దీంతో డబ్ల్యూహెచ్ఓలో భారత్ కీలక పాత్రపోషించనుంది. ప్రతీ మూడేళ్లకు ఒకసారి ఎన్నికయ్యే ఈ బోర్డులో భారత్ తో పాటు మరో 9దేశాలకు చోటు దక్కింది. డబ్ల్యూహెచ్ఓ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను ఎగ్జిక్యూటివ్ బోర్డు అమలు చేస్తుంది. కీలక సమయంలో సలహాలిస్తుంది. ఈబోర్డు ఏడాదికి రెండు సార్లు సమావేశం అవుతుంది.

Similar News