యాదాద్రి ఆలయ పునర్మిర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రెసిడెన్షియల్ సూట్ విల్లా బేస్మెంట్ స్లాబ్ కూలటంతో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వాళ్లంతా మహబూబ్ నగర్, శ్రీకాకుళం చెందిన వాళ్లని అధికారులు చెబుతున్నారు. ఆలయ పునర్ నిర్మాణంలో భాగంగా మొత్తం 15 ప్రెసిడెన్షియల్ సూట్ విల్లాలను వైటీడీఏ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఆరో ప్రెసిడెన్షియల్ సూట్ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. సపోర్ట్ గా ఉన్న ఐరెన్ రాడ్లు పక్కకు జరగటంతో బేస్మెంట్ స్లాబ్ కూలినట్లు అధికారులు చెబుతున్నారు.