త్వరలోనే రైల్వే కౌంటర్లు తెరుస్తాం: పీయూష్ గోయల్

Update: 2020-05-21 16:56 GMT

కేంద్రం లాక్ డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తుంది. దేశ వ్యాప్తంగా జూన్ ఒకటి నుంచి రైల్వే సర్వీసులు ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించింది కూడా. సర్వీసుల్లోకి రానున్న 200 రైళ్ల వివరాలు కూడా తెలియజేశారు. దీనిపై ఆన్ లైన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అయితే, రైల్వే సర్వీసులుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మరో ప్రటకన చేశారు. త్వరలో రైల్వే కౌంటర్లు కూడా తెరుస్తామని.. టికెట్లను.. కౌంటర్లలోనే విక్రయిస్తామని సోషల్ మీడియా వేదికగా ఆయన తెలిపారు. ఇప్పటివరకూ 25 లక్షల మంది వలస కార్మికులను శ్రామిక్ రైళ్లతో వారి సొంత ప్రాంతాలకు చేర్చామని అన్నారు. లాక్‌డౌన్ సమయంలో నిత్యావసరాలు సరఫరా చేయడంలో రైల్వే కీలక పాత్ర పోషించిందన్నారు.

Similar News