అంఫన్ తుఫాను సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కోల్‌కతా నగరం రూపు రేఖలు మారిపోయాయి. గంటక 150 కి.మీ వేగంతో వీచిన వీదురు గాలులకి చెట్లు, భవనాలు నేలకొరిగాయి. బెహాలా ప్రాంతంలో పలాషియల్ బంగ్లాలో ఉంటున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఇంటి ఆవరణలో ఉన్న మామిడి చెట్టు విరిగిపడింది. దీంతో తానే స్వయంగా రంగంలోకి దిగి చెట్టు కొమ్మలకు తాళ్లు కట్టి దాన్ని యథాస్థానంలో నిలబెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. తుఫాను తాకిడికి సెల్‌టవర్లు కూడా దెబ్బతినడంతో సమాచార వ్యవస్థ నిలిచిపోయింది. అనేక చోట్ల భారీగా ఆస్తి నష్టం జరిగింది. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాల పని తీరును గంగూలీ ప్రశంసించాడు.