యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఎస్మా చట్టం ప్రయోగం

Update: 2020-05-22 23:35 GMT

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సంచనల నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు ఎస్మా చట్టం ప్రయోగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వం శాఖలు, కార్పోరేషన్లపై ఈ చట్టం అమలు ఉంటుందని ప్రకటించింది. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అనుమతి మేరకు రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి ముకుల్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆరు నెలల పాటు రాష్ట్రంలో ప్రజా సేవలు నిలిపివేయడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వం, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల ఆధీనంలోని ఎలాంటి సేవలైనా నిలిపివేయడాన్ని నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఎవరైనా.. ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా సమ్మెకు దిగితే.. ఏడాది జైలు శిక్ష గానీ.. వెయ్యి రూపాయలు జరిమానా గానీ విధిస్తారు. ఒక్కోసారి రెండూ విధించే అవకాశం కూడా ఉంది. సమ్మెకు ప్రోత్సహించిన వారిని అరెస్ట్ వారెంట్ లేకుండా.. అదుపులోకి తీసుకుంటారు.

Similar News