కరోనా తగ్గుముఖం పడుతోందని రిలాక్స్ అవ్వొద్దు: డబ్ల్యూహెచ్ఓ

Update: 2020-05-26 17:14 GMT

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడి చేయడానికి లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. అయితే, ఇటీవల పలుదేశాలు ఆర్ధికంగా సంక్షోభంలో చిక్కుకుంటున్నాయని.. మరికొన్నిదేశాలు కరోనా తగ్గుముఖం పడుతుందని లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో నిబంధనలు సడలిస్తే తక్షణమే రెండోసారి ఈ మహమ్మారి ఉగ్రరూపం దాల్చే అవకాశం లేకపోలేదని ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్‌ మైక్‌ ర్యాన్‌ వెల్లడించారు. కొన్ని దేశాల్లో కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. దక్షిణాసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల్లో పెద్ద ఎత్తున కేసులు బయటపడుతున్నాయి. ఇప్పుడు కరోనా తగ్గుతుందని కరోనాను తక్కువ అంచనా వేయడానికి లేదని అన్నారు. అంటు వ్యాదులు దశల వారీగా దాడి చేస్తాయని.. అలా అని.. రెండోసారి దాడి చేయడానికి నెలల సమయం తీసుకుంటుందని కూడా చెప్పలేమని అన్నారు. కరోనా విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. పెను ప్రమాదం తప్పదని ఆయన తెలిపారు.

Similar News