coronavirus : దేశంలో 2.87 శాతానికి తగ్గిన మరణాల రేటు

Update: 2020-05-26 19:05 GMT

ప్రపంచంలో కల్లా భారతదేశంలో అతి తక్కువ COVID-19 మరణాల రేటు ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. దేశంలో కరోనావైరస్ రోగుల మరణాల రేటు ఏప్రిల్‌లో 3.38 శాతం నుండి 2.87 శాతానికి తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనావైరస్ సంక్రమణ కారణంగా దేశంలో 4,167 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా మరణాలు 1,695 గా ఉన్నాయి. దేశంలో మరణాల సంఖ్య తక్కువగా ఉండటానికి ప్రధాన కారణాలు సకాలంలో లాక్డౌన్ మరియు కరోనావైరస్ కేసులను ముందుగా గుర్తించడమని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా లక్ష జనాభాకు 4.4 మరణాలు నమోదయ్యాయని.. కానీ భారతదేశం లక్ష జనాభాకు 0.3 మరణాలు సంభవించాయని లవ్ అగర్వాల్ తెలిపారు.

అలాగే మహమ్మారి బారినపడి కోలుకునే వారిసంఖ్య 60,000 దాటడంతో రికవరీ రేటు 41.61 శాతానికి పెరిగిందని చెప్పారు. దేశంలో మొత్తం కరోనావైరస్ కేసులు 145,380 గా ఉన్నాయి. గత మూడు రోజులుగా 6,500 కి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం, లక్ష జనాభాకు గాను భారతదేశానికి 10.7 COVID-19 కేసులు ఉండగా, ప్రపంచవ్యాప్తంగా లక్ష జనాభాకు 69.9 కేసులు ఉన్నాయని అగర్వాల్ తెలిపారు. మొదటి లాక్డౌన్ ప్రారంభమైనప్పుడు, రికవరీ రేటు 7.1% ఉందని.. ఆ తరువాత రెండవ లాక్డౌన్ సమయంలో రికవరీ రేటు 11.42% యూ పెరిగిందని.. ఇది 26.59% కి పెరిగిందని COVID-19 గురించి రోజువారీ సమావేశంలో చెప్పారాయన.

Similar News