మహారాష్ట్ర కరోనా రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఒకవైపు కరోనా కేసులు రోజురోజుకి రికార్డు స్థాయిలో నమోదవుతుంటే.. మరోవైపు.. కరోనా మరణాలు కూడా కలవరపెడుతున్నాయి. గడిచిన 24 గంటలలో 2598కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 59,546కు చేరింది. అటు, ఒక్కరోజులోనే 85 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాలు 1982కు చేరాయి. ఈరోజు 698 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్రలో ఇంకా 38939 చికిత్సపొందుతున్నారు. అయితే, కరోనాతో భారీగా నష్టపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సాయం కోసం ఎదురు చూస్తుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని మోదీకి లేఖ రాసి.. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.