రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 30 ప్రత్యేక రాజధాని రైళ్లతో పాటు 200 ప్రత్యేక మెయిల్ రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 30 రోజుల వరకే రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. దాన్ని 120 రోజులకు పొడిగించారు. జూన్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా నడిచే రైళ్లకు ఇది వర్తిస్తుంది. ఆ రైళ్లలో పార్సిళ్లు, లగేజీలకు కూడా అనుమతిస్తున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది.