రాజ్యసభ సచివాలయంలోని డైరెక్టర్ ఒకరికి శుక్రవారం కోవిడ్ -19 పాజిటివ్‌గా తేలింది. దీంతో పార్లమెంటు అనెక్స్ భవనం రెండు అంతస్తులు సీలు చేశారు. ఆయన భార్య ,పిల్లలకు కూడా వైరస్ పాజిటివ్ అని గుర్తించారు. దాంతో వారందరిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆయనతో సంప్రదింపులు జరిపిన వారిని కూడా అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు. కాగా దేశంలో పాజిటివ్ కేసులు సంఖ్య 1,65,799కి చేరింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇప్పటివరకు 71,105 మంది కోలుకుని కోవిడ్ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 89,987 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే మొత్తం 4,706 మరణాలు సంభవించాయి.