మానవత్వం మంటగలిసింది. అప్పుడే పుట్టిన మృతశిశువును రోడ్డు పక్కన పడేసి చేతులు దులుపుకున్నారు. హృదయవిదారకమైన ఈ ఘటన.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం, మాదాపూర్‌లో చోటుచేసుకుంది. ఉదయం పొలాలకు వెళ్తున్న రైతులు మృతశిశువును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.