IND VS NZ: టీమిండియా వశమా.. కివీస్ కైవసమా.?

నేడే భారత్-న్యూజిలాండ్ మూడో వన్డే... సిరీస్ ను డిసైడ్ చేయనున్న మ్యాచ్.. రెండో వన్డేలో చేతులెత్తేసిన టీమిండియా

Update: 2026-01-18 04:30 GMT

భా­ర­త్–న్యూ­జి­లాం­డ్‌ మధ్య జరు­గు­తు­న్న వన్డే సి­రీ­స్‌­లో కీలక మ్యా­చు­కు రంగం సి­ద్ధ­మైం­ది. నేడు జర­గ­ను­న్న మూడో వన్డే ఈ సి­రీ­స్‌­కు ఫై­న­ల్‌­లా మా­రిం­ది. తొలి వన్డే­లో ఆధి­ప­త్య ప్ర­ద­ర్శ­న­తో భా­ర­త్‌ వి­జ­యం సా­ధిం­చ­గా, రెం­డో వన్డే­లో టీ­మ్‌­ఇం­డి­యా పూ­ర్తి­గా చే­తు­లె­త్తే­సిం­ది. దీం­తో ఇరు జట్లు ఒక్కో మ్యా­చ్‌ గె­లి­చి సి­రీ­స్‌­ను 1–1తో సమం చే­శా­యి. ఇప్పు­డు అం­ద­రి దృ­ష్టి ని­ర్ణ­యా­త్మక మూడో వన్డే­పై­నే ఉంది. ఈ మ్యా­చ్‌ గె­లి­స్తే సి­రీ­స్‌ భా­ర­త్‌­దే… ఓడి­తే న్యూ­జి­లాం­డ్‌­దే. ఈ కీలక సమ­యం­లో టీ­మ్‌­ఇం­డి­యా­ను అత్యం­త­గా కల­వ­ర­పె­డు­తు­న్న అంశం బౌ­లిం­గ్‌. న్యూ­జి­లాం­డ్‌­తో స్వ­దే­శం­లో జరి­గిన గత టె­స్టు సి­రీ­స్‌­ను భా­ర­త్‌ త్వ­ర­గా మర్చి­పో­లే­క­పో­తోం­ది. మూడు టె­స్టుల సి­రీ­స్‌­లో క్లీ­న్‌­స్వీ­ప్‌­కు గు­రైన భా­ర­త్‌, ఆ పరా­భ­వా­ని­కి ప్ర­తీ­కా­రం­గా ఈసా­రి వన్డే, టీ20 సి­రీ­స్‌­ల­ను కై­వ­సం చే­సు­కో­వా­ల­ని పట్టు­ద­ల­గా ఉంది. కానీ ఆ లక్ష్యా­న్ని చే­రు­కు­నే మా­ర్గం­లో బౌ­లిం­గ్‌ వి­భా­గం ని­రాశ కలి­గి­స్తోం­ది. ము­ఖ్యం­గా తొలి రెం­డు వన్డే­ల్లో ప్ర­త్య­ర్థి బ్యా­ట­ర్ల­ను కట్ట­డి చే­య­డం­లో భారత బౌ­ల­ర్లు పూ­ర్తి­గా వి­ఫ­ల­మ­య్యా­రు.

కలవరపెడుతున్న బౌలింగ్

తొలి రెం­డు వన్డే­ల్లో ప్ర­త్య­ర్థి బ్యా­ట­ర్ల­ను కట్ట­డి చే­య­డం­లో మన బౌ­ల­ర్లు వి­ఫ­ల­మ­య్యా­రు. ప్ర­ధా­నం­గా స్పి­న్న­ర్లు. కి­వీ­స్‌ బ్యా­ట­ర్లు తమ జట్టు­పై ఎలాం­టి ఒత్తి­డి లే­కుం­డా జా­గ్ర­త్త పడు­తు­న్నా­రు. స్పి­న్న­ర్‌ కు­ల్‌­దీ­ప్‌ యా­ద­వ్‌ బౌ­లిం­గ్‌­లో వారి బ్యా­టిం­గ్‌ వ్యూ­హా­త్మ­కం­గా సా­గు­తోం­ది. డరి­ల్‌ మి­చె­ల్‌ ముం­దు­కు వస్తూ బంతి స్పి­న్‌ కా­క­ముం­దే దా­డి­కి ది­గు­తు­న్నా­డు. అతడి బం­తు­ల­ను డరి­ల్‌­తో పాటు ఇతర బ్యా­ట­ర్లు అల­వో­క­గా స్వీ­ప్‌ చే­స్తూ పరు­గు­లు రా­బ­ట్టా­రు. కు­ల్‌­దీ­ప్‌ మా­త్ర­మే కాదు.. మి­గ­తా స్పి­న్న­ర్లు ఎలాం­టి ప్ర­భా­వం చూ­ప­లే­క­పో­యా­రు. రెం­డు వన్డే­ల్లో కలి­పి భారత స్పి­న్న­ర్లు తీ­సిం­ది రెం­డే వి­కె­ట్లు. ఆ రెం­డు కు­ల్‌­దీ­ప్‌ ఖా­తా­లో చే­రా­యి.

బ్యా­ట­ర్ల­ను కట్ట­డి చే­స్తు­న్న­ప్ప­టి­కీ రవీం­ద్ర జడే­జా వి­కె­ట్లు పడ­గొ­ట్ట­డం­లో రెం­డు మ్యా­చ్‌­ల్లో వి­ఫ­ల­మ­య్యా­డు. తొలి మ్యా­చ్‌­లో వా­షిం­గ్ట­న్‌ సుం­ద­ర్‌ గాయం కా­ర­ణం­గా కోటా పూ­ర్తి­చే­య­లే­దు. రెం­డో మ్యా­చ్‌­లో అతడి స్థా­నం­లో ఆడిన ని­తీ­శ్‌ కు­మా­ర్‌ రె­డ్డి కే­వ­లం రెం­డు ఓవ­ర్లే బౌ­లిం­గ్‌ చే­శా­డు. ఇక్కడ పరి­స్థి­తు­ల­పై పె­ద్ద­గా అను­భ­వం లేని కి­వీ­స్‌ స్పి­న్న­ర్లే మె­రు­గైన ప్ర­ద­ర్శన చే­శా­రు. సి­రీ­స్‌­లో ని­ర్ణ­యా­త్మక వన్డే­కు వే­ది­కైన ఇం­దౌ­ర్‌ బ్యా­టిం­గ్‌­కు అను­కూ­లం. బౌ­ల­ర్లు క్ర­మ­శి­క్షణ తప్పి­తే బంతి బౌం­డ­రీ­లో దర్శ­న­మి­వ్వ­డం ఖాయం. ఇక్కడ వి­కె­ట్ల­కు నే­రు­గా బం­తు­లే­స్తూ.. లెం­గ్త్‌­లో వై­వి­ధ్యం­తో బ్యా­ట­ర్ల­ను కట్ట­డి చే­యా­లి. మరి ఈ మ్యా­చ్‌­కు భా­ర­త్‌ ఎలాం­టి వ్యూ­హం­తో బరి­లో ది­గు­తుం­ద­న్న­ది ఆస­క్తి­క­రం. ని­తీ­శ్‌ కు­మా­ర్‌ స్థా­నం­లో ఆఫ్‌­స్పి­న్‌ వే­య­గల ఆయు­ష్‌ బదో­ని­ని తుది జట్టు­లో­కి తె­చ్చే అవ­కా­శా­లు లే­క­పో­లే­దు. పి­చ్‌ పరి­స్థి­తు­ల­ను దృ­ష్టి­లో పె­ట్టు­కు­ని ప్ర­సి­ద్ధ్‌ కృ­ష్ణ స్థా­నం­లో లె­ఫ్ట్‌ ఆర్మ్‌ సీ­మ­ర్‌ అర్ష్‌­దీ­ప్‌ సిం­గ్‌­ను ఆడిం­చొ­చ్చు. ఏదే­మై­నా ఈ మ్యా­చ్‌­లో బౌ­లిం­గే భా­ర­త్‌ వి­జ­యం­లో కీ­ల­క­పా­త్ర పో­షిం­చ­బో­తోం­ది.

ఈ పరి­స్థి­తు­ల్లో భా­ర­త్‌ జట్టు­లో కొ­న్ని మా­ర్పు­లు చేసే అవ­కా­శం కని­పి­స్తోం­ది.ని­తీ­శ్ కు­మా­ర్ రె­డ్డి స్థా­నం­లో ఆఫ్‌­స్పి­న్‌ వే­య­గల ఆయు­ష్ బదో­ని­ని ఆడిం­చే అవ­కా­శా­లు చర్చ­లో ఉన్నా­యి. బ్యా­టిం­గ్‌­కు అను­కూ­ల­మైన పి­చ్‌­ను దృ­ష్టి­లో పె­ట్టు­కు­ని, అద­న­పు బ్యా­టిం­గ్‌ లోతు అవ­స­ర­మై­తే ఈ మా­ర్పు ఉప­యో­గ­ప­డొ­చ్చు. అలా­గే పే­స్‌ వి­భా­గం­లో­నూ మా­ర్పు­లు చేసే అవ­కా­శం ఉంది. ప్ర­సి­ద్ధ్ కృ­ష్ణ స్థా­నం­లో లె­ఫ్ట్‌ ఆర్మ్‌ సీ­మ­ర్‌ అర్ష్ దీప్ తుది జట్టు­లో­కి తీ­సు­కు­రా­వ­చ్చు. కొ­త్త బం­తి­తో స్విం­గ్‌ సా­ధి­స్తే ఆరం­భం­లో­నే వి­కె­ట్లు పడ­గొ­ట్టే అవ­కా­శం ఉం­టుం­ది.

Tags:    

Similar News