ఇండస్ట్రీలో వేధింపులే నన్ను నటనకు దూరం చేశాయి: నటి కళ్యాణి

Update: 2020-06-01 19:02 GMT

అవకాశాలు ఎలా వస్తాయి.. అన్ని విషయాల్లో సర్థుకుపోతేనే కదా అనే ఇండస్ట్రీకి చెందిన కొందరి వ్యక్తుల మాటలు నన్ను నటనకు దూరం చేశాయి అని తమిళ నటి కల్యాణి తెలిపారు. తమిళంలో తెరకెక్కిన జయం, అలై తండా వానమ్, ఎస్ఎంఎస్ సినిమాలతో పాటు తెలుగులో మళ్లీ చిత్రంలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కల్యాణి. బుల్లి తెర ప్రేక్షకులను కూడా తన నటనతో మైమరపించింది. అయితే గత కొంత కాలంగా సినిమాలకు, సీరియల్స్‌కు దూరంగా ఉంది కళ్యాణి. ఆ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలోనే ప్రభుదేవాతో కలిసి అలై తండా వానమ్ అనే చిత్రంలో నటించాను. ఆ తరువాత మరిన్ని చిత్రాల్లో అవకాశం వచ్చింది. హీరోయిన్‌గా నిలదొక్కుకుంటున్న తరుణంలో మా అమ్మకు కొందరు సినిమా వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. మీ అమ్మాయి సినిమాల్లో నిలదొక్కుకోవాలంటే కొన్ని విషయాల్లో సర్ధుకుపోవాలి అని అన్నారు.. దాంతో నేను ఇండస్ట్రీకి దూరం అయ్యాను. ఇక బుల్లి తెర పరిస్థితి కూడా అంతే అక్కడ అలాంటి వేధింపులే ఎదురయ్యాయి. దాంతో సీరియల్స్ల్‌లో కూడా నటించడం మానేశాను. ప్రస్తుతం కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాను అని తెలిపారు కల్యాణి.

Similar News