అమరవీరులకు కేసీఆర్‌ నివాళి

Update: 2020-06-02 13:30 GMT

కోట్ల మంది ప్రజల ఆకాంక్షగా ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 6వ వసంతంలో అడుగుపెట్టింది. జూన్‌ 2 , 2014 ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ... ఎందరో త్యాగాలకు ప్రతీకగా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతోంది. ప్రతి ఏటా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని... తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తోంది. అయితే ఈ ఏడాది కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితుల్లో... పెద్దగా హంగూ అర్భాటాల్లేకుండా... రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా.. గన్‌పార్క్‌ వద్ద... అమరవీరులకు.. సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించారు. 2 నిమిషాలపాటు మౌనం పాటించారు.

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చేసుకున్న తెలంగాణ అతి తక్కువ సమయంలోనే తన విశిష్టతను చాటుకుని పలు రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచింది. రైతలు, బలహీన వర్గాల కోసం కేసీఆర్ ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలు, పథకాలకు శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతలను శరవేగంగా పూర్తి చేసింది. ఇంటింటికీ మిషన్‌ భగీరథ పేరుతో నీటిని సరఫరా చేస్తోంది. రైతు బంధు, బీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌తోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో సంతోషాన్ని నింపుతున్నాయి.

మరోవైపు కేసీఆర్ గన్‌పార్క్‌ నుంచి ప్రగతి భవన్‌కు వెళ్తున్న క్రమంలో ఓ వ్యక్తి కాన్వాయ్‌కు అడ్డువచ్చాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పక్కకి తప్పించారు.

Similar News