బంకర్‌లో తలదాచుకున్న ట్రంప్.. బంకర్‌ ప్రత్యేకత ఇదే..

Update: 2020-06-02 12:21 GMT

అమెరికాలో ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి ట్రంప్ వైట్‌హౌజ్‌ను వదిలి రావడం లేదు. నిరసనకారులు వేలాదిగా తరలిరావడంతో శ్వేతసౌధం భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన కుటుంబ సభ్యులను బంకర్‌లోకి తరలించారు. సాధారణంగా ఉగ్రదాడుల వంటి ఘటనలు జరిగిన సమయంలోనే అధ్యక్షుడు వైట్‌హౌజ్‌లోని బంకర్‌లోకి వెళ్తారు. సురక్షిత స్థావరం కావడంతో అక్కడి నుంచే తన అధికారిక కార్యకలాపాలను నిర్వహిస్తారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇలా బంకర్‌లో తలదాచుకోవడంతో.. అసలు బంకర్‌ ప్రత్యేకత ఏమిటి..? శ్వేతసౌధంలో ఎక్కడ ఉంటుంది..? అన్న విషయాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. రెండో ప్రపంచ యుద్ధ సమయం 1940లో నాటి అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డెలానో రూజ్‌వెల్ట్‌ హయాంలో బంకర్‌ను నిర్మించారు. 1948లో అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్‌ మెరుగులద్దారు. శ్వేతసౌధం తూర్పు భాగంలో భూమి లోపల శత్రుదుర్భేద్యంగా దీన్ని నిర్మించారు. చివరిసారిగా 2001లో న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఉగ్రదాడి జరిగిన సమయంలో.. అప్పటి అధ్యక్షుడు బుష్‌, వైట్‌హౌస్‌ సిబ్బందితో బంకర్‌లో తలదాచుకున్నారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడూ ఆందోళనలు జరిగినా.. ఆయన ఎన్నడూ బంకర్‌ను వాడలేదని సమాచారం.

Similar News