కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి కొద్దికొద్దిగా ఆంక్షలు సడలిస్తుంది. అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు కూడా కేంద్రం ఓ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనిపై పౌరవిమానయాన శాఖ మంత్రి మాట్లాడుతూ.. సాదారణ పరిస్థితులు రాగానే.. వెంటనే ప్రారంభించాలని నిర్ణయించాం. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. అన్ని జాగ్రత్తలు తీసుకొని అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభిస్తామని అన్నారు.
లాక్‌డౌన్ ను అన్ లాక్ చేస్తూ.. నిబంధనలు సడలించిన.. కేంద్రం.. జూన్ 30 వరకూ అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిషేధించింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలు పునరుద్ధరిస్తే.. ఎదురయ్యే సమస్యలు అన్ని లెక్కకట్టుకొని జూలై నుంచి ప్రారంభించాలని కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.