అలా చేస్తే.. అమెరికా కంటే ఎక్కువ కేసులు భారత్‌లో ఉంటాయి: ట్రంప్

Update: 2020-06-06 16:54 GMT

భారత్, చైనాలో.. అమెరికా మాదిరిగా కరోనా పరీక్షలు చేసి ఉంటే.. తమ కంటే ఎక్కవ కేసులు బయటపడేవని అమెరికా అధ్యక్షుడు అన్నారు. అమెరికాలో పరీక్షలు ఎక్కవగా జరుగుతున్నాయి కనుక ఎక్కవ కేసులు బయటపడుతున్నాయని అన్నారు. ఇప్పటివరకూ రెండు కోట్ల కరోనా టెస్టులు జరగాయని.. ఈ స్థాయిలో మరో దేశంలో కూడా జరగలేదని అన్నారు. కరోనా కట్టడి చేశామని చెప్పుకుంటున్న జర్మనీ, దక్షిణ కరియాలో కూడా ఈ స్థాయిలో జరగలేదని అన్నారు. జర్మనీలో 40 లక్షలు, దక్షిణ కొరియాలో 30 లక్షలు పరీక్షలు జరిగాయని అన్నారు. ప్రపంచంలో ఎక్కవగా కరోనా కేసులు, కరోనా మరణాలు సంభవించిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకూ 19లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. లక్షలకు పైగా మరణాలు అమెరికాలో సంభవించాయి. అటు, భారత్ లో ఇప్పటి వరకూ 2,36,657 కేసులు నమోదవ్వాగా.. చైనాలో 85వేల కేసులు నమోదయయ్యాయి. ఐసీఎంఆర్ వివరాల ప్రకారం జూన్ 6 ఉదయానికి భారత్ లో 45,24,317 కరోనా టెస్టులు జరిగాయి.

Similar News