జో బిడెన్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించిన డెమొక్రట్ పార్టీ

Update: 2020-06-06 21:14 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అటు డెమొక్రట్ పార్టీ, ఇటు రిపబ్లికన్ పార్టీ రెండూ సిద్ధమవుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ తరుపున జో బిడెన్ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించిది. ఏప్రిల్ లోనే ఆయన ఫిక్స్ అయినట్టు తెలిపినా.. అధికారికంగా ఇప్పుడు ప్రకటించారు. అధ్యక్ష పోటీకి అవసరమైన 1993 మంది ప్రతినిధులు బిడెన్ కు మద్దతు తెలిపారు. డెమొక్రట్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో బెర్ని శాండర్స్ కూడా ఉన్నా.. ఏప్రిల్ లో పోటీ నుంచి తప్పుకొని.. జో బిడెన్ కు మద్దతు ఇచ్చారు. దీంతో అప్పుడు ఆయన పోటీ ఫిక్స్ అయింది. నవంబర్ లో జరగనున్న అద్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తో తలపడనున్నారు.

జో బిడెన్ 36 ఏళ్లగా అమెరికా సెనేటర్ గా కొనసాగుతున్నారు. ఇప్పటికే మూడు సార్లు అద్యక్ష ఎన్నికల్లో పోటీకి ప్రయత్నించి విఫలమయ్యారు. బరాక్ ఒబామా అద్యక్షడుగా ఉన్న సమయంలో 2009 నుంచి 2017 వరకూ అమెరికా ఉపాద్యక్షుడిగా పనిచేశారు. మెజారిటీ సభ్యుల మద్దతు ఆయనకు లభించడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన గౌరవమని.. ఇక ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని తెలిపారు.

దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగిపోయిందని... మన గౌరవం పెంచే ఉద్యోగాలు మనకు కావాలని జో బిడెన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పడిపోయిందని.. తిరిగి దాన్ని బలోపేతం చేయాలి ఉందని.. ప్రతీ అమెరికన్ కు న్యాయం జరగాలని అన్నారు. ప్రజల అవసరాలు తీర్చే అధ్యక్షుడు ఇప్పుడు కావాలని అన్నారు. గతంలో ఎన్నడూ చూడని హింసాత్మక ఘటనలు దేశంలో చోటు చేసుకుంటున్నాయని అన్నారు.

Similar News