రాజ్యసభకు మాజీ ప్రధాని దేవెగౌడ పోటీ..

Update: 2020-06-08 15:39 GMT

కర్ణాటక నుంచి రాజ్యసభ అభ్యర్థిగా మాజీ ప్రధాని దేవెగౌడ బరిలోకి దిగుతున్నారు.. ఆయన అభ్యర్థిత్వాన్ని జెడి (ఎస్)పార్టీ ఖరారు చేసింది. ఈ విషయాన్ని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి సోమవారం ధృవీకరించారు. అందరి ఆశలు ఆశయాలకు తగ్గట్టుగానే హెచ్‌డి దేవేగౌడ స్పందించారని.. రాజ్యసభలో రాష్ట్ర అత్యున్నత ప్రతినిధిగా దేవేగౌడ ఉంటారు అని కుమారస్వామి ట్విట్టర్లో ట్వీట్ చేశారు. దేవేగౌడ.. సోనియా గాంధీ సహా పలువురు జాతీయ నాయకుల అభ్యర్థన మేరకు రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించారు. మంగళవారం ఆయన నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు అని కుమారస్వామి తెలిపారు. ఇదిలావుంటే దేవెగౌడ గెలిస్తే పెద్దల సభకు వెళ్తున్న రెండో మాజీ ప్రధాని అవుతారు. ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పెద్దల సభలోనే ఉన్నారు.

Similar News