హైదరాబాద్- మల్కాజ్‌గిరిలోని వరద ముంపు ప్రాంతంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పర్యటించారు. ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లో వరద ముంపు నివారించేందుకు బండ చెరువు నుంచి వచ్చే నాలాను 2 కిలోమీటర్ల మేర మళ్లించనున్నట్టు మేయర్ తెలిపారు. 40 కోట్ల రూపాయలతో చేపట్టిన రైల్వే అండర్ బ్రిడ్జి, రోడ్డు విస్తరణ పనులను మేయర్ తనిఖీ చేశారు. GHMC కమిషనర్ లోకేశ్ కుమార్‌తోపాటు.. ఇతర ఉన్నతాధికారులు ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లో పరిస్థితుల్ని సమీక్షించారు.