డ్యాన్స్ స్కూల్ అని బోర్డ్.. కానీ లోపల జరిగేది..

Update: 2020-06-11 14:27 GMT

విజయవాడకు చెందిన ఓ డ్యాన్స్ మాస్టర్ గచ్చిబౌలి టీఎన్జీవోస్ కాలనీలో జుంబా డ్యాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నాడు. నగరంలో కూడా మరో రెండు డ్యాన్స్ స్కూల్స్ నడుపుతున్నాడు. డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన యువతులను మాయమాటలతో మభ్యపెట్టి డ్యాన్స్ స్కూల్ పెడితే లాభాలు వస్తాయని నమ్మించాడు. అతడి మాటలు నమ్మి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి రూ.9 లక్షలు, హైదర్షాకోట్ కు చెందిన మరో యువతి రూ.6 లక్షలు ఇచ్చారు. డ్యాన్స్ స్కూల్ పెట్టకపోగా వారిని లైంగికంగా వేధించేవాడు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఈనెల 4న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశార. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

Similar News