కార్యకర్తలకు ఉద్యోగాల పేరుతో వేల మందిని రోడ్డున పడేశారు : లోకేశ్

Update: 2020-06-11 20:44 GMT

 

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ ఆరోపనాస్త్రాలు సంధించింది. జగన్ పాలనలో కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఎంతోమందికి అండగా నిలిచిన... "ప్రజలే ముందు" అనే పరిష్కారవేదిక 1100 కాల్‌ సెంటర్‌ని జగన్ సర్కారు నిర్వీర్యం చేసిందని ఆయన ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన కాంట్రాక్టును జగన్ తన బంధువర్గానికి కట్టబెట్టారని లోకేష్ ఆరోపించారు. తమ పార్టీ కార్యక్తల కోసం వైసీపీ ప్రభుత్వం 2 వేల 200 మందిని ఉద్యోగాల్లోంచి పీకేశారని ఆయన ట్విటర్‌లో ఆరోపించారు. వేయగలిగితే రంగు... అంటించగలిగితే స్టిక్కర్, మార్చగలిగితే పేరు... ఇదే జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతిని కూడా ఎత్తేశారని, కార్యకర్తలకు ఉద్యోగాల పేరుతో వేల మందిని రోడ్డున పడేశారని లోకేష్ మండిపడ్డారు.

Similar News