ఎస్‌బీఐ లైఫ్‌లో ఎస్‌బీఐ వాటా విక్రయం

Update: 2020-06-12 16:32 GMT

ఎస్‌స్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో 2.1 శాతం వాటాను విక్రయించనున్నట్టు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ ఎస్‌బీఐ ప్రకటించింది. షేర్‌హోల్డింగ్స్‌ మార్గదర్శకాల ప్రకారం ఈ వాటాను విక్రయించనున్నట్టు తెలిపింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌(OFS) ప్రక్రియలో మొత్తం 2.1 కోట్ల ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్ షేర్లను అమ్మివేయనున్నట్టు వెల్లడించింది.

ఒఎఫ్‌ఎస్‌ ఇష్యూ కోసం ఫ్లోర్‌ ధరను ఒక్కో షేరుకు రూ.725గా ఎస్‌బీఐ నిర్ణయించింది. గురువారం ముగింపు ధరతో పోలిస్తే 2.1శాతం డిస్కౌంట్‌ షేర్లను విక్రయించనున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. సంస్థాగతేతర ఇన్వెస్టర్లు కోసం ఒఎఫ్‌ఎస్‌ ఇవాళ ప్రారంభం కానుండగా, రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం జూన్‌ 15న ప్రారంభం కానుంది.

Similar News