మార్నింగ్ సెషన్‌లో ఓ మోస్తారు నష్టాల్లో కదలాడిన దేశీయ మార్కెట్లు చివరకు భారీ నష్టాలతో ముగిశాయి. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత బ్యాంకింగ్, ఆటో, మెల్స్, టెక్నాలజీ స్టాక్స్ అనూహ్యంగా భారీ సెల్లింగ్‌కు గురికావడం మన మార్కెట్ల సెంటిమెంట్‌ను బలహీనపర్చింది. యూఎస్ మార్కెట్లు భారీ నష్టలతో ఓపెన్ కావడంతో దేశీయ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు.
అమెరికా జీడీపీ 6.5 శాతం క్షీణిస్తుందన్న యూఎస్ ఫెడ్ అంచనాలు ప్రపంచ మార్కెట్లను నిరుత్సాహ పరిచాయి. ఆర్థిక వ్యవస్థకు మద్దతిస్తామని యూఎస్ ఫెడ్ ప్రకటించిన్నప్పటికీ మార్కెట్లను ఉత్సాహపరచలేకపోయాయి. దీంతో గురువారం నిఫ్టీ దాదాపు 214 పాయింట్ల నష్టంతో 9902 వద్ద, సెన్సెక్స్ 709 పాయింట్ల నష్టంతో 33,538 వద్ద ఇవాళ్టి ట్రేడింగ్‌ను ముగించాయి. ముఖ్యంగా బ్యాంక్ సూచీ దాదాపు 3శాతం (575 పాయింట్లు) నష్టపోయి 20,525 వద్ద క్లోజైంది.
ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, వొడాఫోన్ ఐడియా, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐలు చురుగ్గా కదలాడాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 4.71 శాతం, హీరోమోటోకార్ప్ 0.77 శాతం, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ 0.56 శాతం, ఎంఅండ్‌ఎం 0.53 శాతం, నెస్లే 0.44 శాతం లాభంతో ఇవాళ్టి నిఫ్టీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్ 9.41 శాతం, జీ ఎంటర్‌టైన్‌మెంట్ 7.30 శాతం, ఎస్‌బీఐ 5.62 శాతం, సన్‌ఫార్మా 5.11 శాతం, వేదాంతా 4.76 శాతం నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.