కరోనా పరీక్షలు చేయొద్దని అతి పెద్ద ప్రైవేట్ ల్యాబ్‌కు ఆదేశాలు.. కారణం ఇదే

Update: 2020-06-12 20:35 GMT

ముంబైలోని అతి పెద్ద ప్రైవేట్ ల్యాబ్ కు కరోనా పరీక్షలు నిర్వహించవద్దని ఆదేశాలు వెలువడ్డాయి. నెలరోజులు పాటు కరోనా పరీక్షలు చేయకుండా ముంబైనగరపాలక సంస్థ నిషేధం విధించింది. పరీక్షలు జరిపిన తరువాత ఫలితాలు అందించడంలో జాప్యం చేస్తున్నారని.. దీంతో రోగులు చాలా మందిని కలిసే అవకాశం ఉందని.. ఇది మరింత ప్రమాదమని బీఎంసీ తెలిపింది. ఇది కరోనా కట్టడిలో ప్రతికూల ప్రభావం చూపిస్తుందని తెలిపింది. దీంతో ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది.

Similar News