ట్రంప్ వైఖరిపై ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ అసహనం..

Update: 2020-06-13 16:51 GMT

ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ప్లాయిడ్ హత్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ ఆయన భార్య ప్రిస్కిల్లా చాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ట్రంప్ ని సమర్థిస్తూ వచ్చిన జుకర్ తాజాగా ట్రంప్ చేసిన వివాదాస్పద పోస్టులపై మొట్టమొదటి సారి ప్రత్యక్షంగా విమర్శలు చేశారు. జుకర్ బర్గ్ సంస్థకు నిధులు సమకూర్చిన 270 మంది శాస్త్రవేత్తలు ఫేస్ బుక్ ప్లాట్ ఫామ్ లపై తప్పుడు సమాచారం. ద్వేషపూరిత పోస్టులను అరికట్టాలంటూ డిమాండ్ చేశారు. ట్రంప్ పోస్ట్ హింసను ప్రేరేపించేదిగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమర్శలకు సమాధాన మిచ్చారు జుకర్ దంపతులు. దేశానికి చాలా ఐక్యత అవసరమైన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ విభజన వాదం విచారకరమంటూ వీరు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉండగా ప్లాయిడ్ మరణం తరువాత ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమానికి జుకర్ బర్గ్, చాన్ మద్దతు తెలపడం విశేషం.

Similar News