ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం.. పీజీ, డిగ్రీ పరీక్షలు రద్దు

Update: 2020-06-12 22:28 GMT

పెండింగ్‌లో ఉన్న పీజీ, డిగ్రీ పరీక్షలను ఒడిశా ప్రభుత్వం రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే, వాటిపై ఒడిశా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫైనల్ సెమిస్టర్ లో రెండు కంటే ఎక్కువ బ్యాక్ పేపర్లు ఉన్న విద్యార్థుల పరీక్షలు కూడా రద్దు చేయబడ్డాయని అధికారులు తెలిపారు. అయితే, మెడికల్ విద్యార్థులకు మాత్రం ఇది వర్తించదని విద్యాశాఖ తెలిపింది. అనుకున్న సమయానికి మెడికల్ పరీక్షలను మాత్రం నిర్వహిస్తామని అధికారులు చెప్పారు.

Similar News