ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన జీఎస్టీ పరిహారం వెంటనే చెల్లించాలని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 40వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న హరీష్‌రావు.. కరోనా పరిస్థితుల్లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన 2800 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కోరారు. దేశంలో అతి తక్కువ జీఎస్టీ పరిహారం పొందిన రాష్ట్రం తెలంగాణ అని.. కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. కోవిడ్-19 వల్ల రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందని.. ఈ తరుణంలో కేంద్రం, రాష్ట్రాలకు సహకారిగా ఉండాలని సూచించారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన జీఎస్టీ పరిహార మొత్తం 3975 కోట్లను జూన్ నెలలోనే ఇవ్వాలని మంత్రి హరీష్‌రావు కేంద్రాన్ని కోరారు.