జూలై 10 నుంచి 'సినిమా' చూపిస్తారంట..

Update: 2020-06-17 18:05 GMT

జూలై 10 నుంచి అమెరికాలో థియేటర్లు ఓపెన్ కానున్నాయి. ఇది సినిమా ప్రియులకు సంతోషించే వార్తే అయినా.. కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని మరో వర్గం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లాస్ ఏంజెల్స్, న్యూయార్క్ నగరాలలో సినిమా థియేటర్లు తెరిచేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిపోతున్నాయి. అన్నీ అనుకూలిస్తే జూలై 10 నుంచి థియేటర్లలో సినిమా చూడొచ్చని అక్కడి వార్త సంస్థ ఒకటి ట్వీట్ చేసింది. కానీ భారత్ లోని కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ చేయాలంటే భయపడుతున్నాయి ప్రభుత్వాలు. ఇక్కడ విద్యాసంస్థలకు, థియేటర్లకు ఇంకా అనుమతులు లభించలేదు. వైరస్ విస్తరించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వెనుకడుగు వేస్తున్నాయి. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తయిన చిత్రాలు కొన్ని ఓటీటీలో విడుదలై సినీ ప్రియులకు కొంత ఊరట కలిగిస్తున్నాయి.

Similar News