అలా చేస్తే.. ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు

Update: 2020-06-16 23:11 GMT

కేవలం అమ్మఒడి నిధులు మిగుల్చుకోవడం కోసమే ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తోందని ఏపీ BJYM అధ్యక్షుడు రమేష్ నాయుడు ఆరోపించారు. నాడు- నేడు, అమ్మ ఒడి, విద్యాదీవెన పథకాల నిధుల్ని ఆదా చేసుకోవాలని జగన్ సర్కారు భావిస్తోందన్నారు. అందుకే విద్యార్థులు ఫెయిల్ అవ్వాలని కోరుకుంటోందని విమర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని.. పదోతరగతి స్టూడెంట్స్‌ను పైతరగతికి ప్రమోట్ చేయాలన్నారు. అలా కాకుండా మొండిగా పరీక్షలు నిర్వహిస్తే.. జరిగే నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు రమేష్‌ నాయుడు.

Similar News