షేక్‌పేట ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఐదంతస్తుల భవనంపైనుంచి దూకడంతో అజయ్ కుమార్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఉదయం చిక్కడపల్లిలోని సోదరి ఇంటికి వెళ్లిన అజయ్.. ఇలా సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఎమ్మార్వో సుజాత ఇటీవలే ACB అధికారులకు పట్టుబడ్డారు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో 40 కోట్ల విలువైన ఓ భూమికి సంబంధించిన వివాదం విషయంలో ఇటీవల ఏసీబీ అధికారులు కొందరిని అరెస్ట్ చేశారు. షేక్‌పేట ఆర్‌ఐ, బంజారాహిల్స్ ఎస్సైలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణలోనే షేక్‌పేట తహశీల్దార్‌గా పనిచేస్తున్న సుజాత కూడా లంచం తీసుకున్నట్టు ఆధారాలు దొరకడంతో పూర్తిగా దర్యాప్తు చేసి ఆమెను కూడా అరెస్టు చేశారు. జూన్8న ఆమెను ACB అదుపులోకి తీసుకుంది. సుజాత ఇంట్లో 30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బుకు ఆ కుటుంబం సరైన లెక్కలు చూపించలేక పోయింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మార్వో సుజాత కుటుంబం తీవ్ర ఒత్తిడికి లోలైనట్టు తెలుస్తోంది. ఆమె భర్త అజయ్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఐతే. ఏసీబీ వేధింపుల వల్లే తన సోదరుడు సూసైడ్ చేసుకున్నారని సోదరి చెప్తోంది.