కొనసాగుతోన్న ఆర్మీకల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర

Update: 2020-06-18 11:43 GMT

ఆర్మీకల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభం అయింది. చైనా దుర్చర్యకు ప్రాణాలుకోల్పోయిన అమర జవాన్ కు నివాళులర్పించేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సంతోష్ బాబును కడసారిచూసేందుకు నగరవాసులు ఉదయం నుంచే బారులు తీరారు. అతనితో తమకున్న అనుబంధాన్ని తలచుకొని కన్నీటి పర్యంతమయ్యారు. సైనిక లాంచనాలతో ప్రత్యేక వాహనంలో సంతోష్ బాబు భౌతిక కాయాన్ని ఉంచారు. ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అంతిమయాత్రలో సంతోష్‌ బాబు కుటుంబీకులు, బంధువులు, ఆర్మీ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. కల్నల్ అంతిమయాత్రలో పాల్గొనేవారు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పని సరిగా ధరించాలని అధికారులు తెలిపారు.

Similar News