usa floods : అమెరికా హూస్టన్ ప్రాంతంలో వరదలు
కుండపోత వర్షాలతో శాన్ జసింటో నది ఉదృతి;
అమెరికా హూస్టన్ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలతో శాన్ జసింటో నది ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. వరద ప్రభావ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఉత్తర హారిస్ కౌంటీ నది పరిసరాల్లో ఉన్నవారిని అధికారులు ముందు జాగ్రత్తగా ఖాళీ చేయిస్తున్నారు. రహదారులు నీటితో నిండటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని...పలు వాహనాలు వరదలో చిక్కుకున్నాయని స్థానికులు తెలిపారు. . అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఇళ్లల్లో నుంచి బయటికి రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఫలితంగా- అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలిచింది. మోకాలి లోతుకు పైగా వర్షపు నీరు నిలిచిపోయింది. సబ్‌బేలన్నీ వరద నీటితో నిండిపోయాయి. చెరువులను తలపించాయి.