దేశంలో కొత్తగా 12,881 కరోనా కేసులు

Update: 2020-06-18 12:09 GMT

భారత్ లో కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి, గురువారం దేశంలో అత్యధికంగా 12,000 పైగా పాజిటివ్ కేసులను నమోదు చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, గత 24 గంటల్లో మొత్తం 12,881 కేసులు నమోదయ్యాయి, దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,66,946 కు పెరిగింది. అలాగే గత 24 గంటల్లో 334 మరణాలు సంభవించాయి. దీంతో భారతదేశ మరణాల సంఖ్య కూడా పెరిగింది. ప్రాణాంతక వైరస్ కారణంగా దేశంలో ఇప్పుడు 12,237 మంది మరణించారు. ఇక వైరస్ బారిన పడిన తరువాత మొత్తం 1,94,324 మంది కోలుకున్నారు.. ప్రస్తుతం దేశంలో 1,60,384 క్రియాశీల కేసులు ఉన్నాయి.

Similar News