40మంది తమ సైనికులు చనిపోయారనే వార్తలను ఖండించిన చైనా

Update: 2020-06-22 20:04 GMT

గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య జరిగిన ఘటనలో డ్రాగన్ జవాన్లు 40 మంది మరణించారని కేంద్ర మంత్రి వీకే సింగ్ ప్రకటన చేశారు. అయితే, దీనిపై స్పందించిన చైనా దానిని ఖండించింది. ఆ 40 మందికి సంబందించిన సమాచారం తమదగ్గర లేదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి అధికార ప్రతినిధి జావో లిజియన్ అన్నారు. భారత్, చైనాల మధ్య తలెత్తిన ఘర్షణలపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. అయితే, 40 మంది చైనా సైనికులు మరణిచారని అంటున్న భారత్ వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా.. ఆ 40 మంది సైనికుల గురించి తమకు తెలియదని అన్నారు. అయితే, చైనా 1962 భారత్, చైనా యుద్ధంలో కూడా చనిపోయిన చైనా సైనికులు వివరాలను పూర్తిగా వెల్లడించలేదని విమర్శలు ఉన్నాయి. గతంలో ప్రపంచవ్యాప్తంగా అంటురోగాల విషయంలోనూ.. ప్రస్తుతాన్ని ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా విషయలో కూడా కేసుల సంఖ్యలు దాచిపెడుతోందనే ఆరోపణలు చైనా ఎదుర్కొంటుంది. అదే.. విధంగా గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో చనిపోయిన చైనా సైనికులు వివరాలు కూడా బయటకు తెలపడం లేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తుంది.

Similar News