గాల్వాన్ లోయ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘటనలో మరో భారత జవాన్ అమరవీరుడైయ్యాడు. చైనా దుర్బుద్ధితో సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఇరుదేశాల సైనికులు మధ్య దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇప్పటికే 20 మంది మృతి చెందగా.. తాజాగా సచిన్ విక్రమ్ మారే అనే జవాన్ వీరమరణం పొందాడు. జూన్ 15న జరిగిన ఘటనలో నదిలో పడిపోయిన ఇద్దరు సైనికులను కాపాడే ప్రయత్నంలో విక్రమ్ కు తీవ్ర గాయాలయ్యాయని.. దీంతో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడని వైద్యులు చెప్పారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది.