అమ్మకానికి 'చే గువేరా' జన్మించిన భవనం

Update: 2020-06-26 18:01 GMT

యువతకు ఆదర్శపాత్రుడు, విప్లవ వేగుచుక్కైన చే గువేరా పుట్టిన ఇల్లు ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. అర్జెంటీనాలోని రోసారియాలో నియో క్లాసికల్ అనే భవనంలో 1928లో ఆయన జన్మించారు. 240 చ‌దరపుమీటర్ల అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ భ‌వ‌నాన్ని సాంస్కృతిక నిల‌యంగా మార్చాలనే ఉధ్దేశ్యంతో 2002లో ఫ్రాన్సిస్కో ఫ‌రూగియా కొనుగోలు చేశాడు. అయితే, ఆయన అనుకున్నది సాధ్యం కాలేదు. దీంతో ఆయన దీనిని అమ్మకానికి సిద్ధం చేశారు. ఈ భవనాన్ని చాలా మంది ప్రముఖులు సందర్శించారు. ఈ భవనం ఉర్కిజా, ఎంటర్ రియాస్ మధ్య ఉండటం వలన ఎందరో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఉరుగ్వే మాజీ అధ్యక్షుడు జోస్ పీపీ ముసికా దీన్ని సందర్శించారు. అటు, 1950 లో చే గువేరాతో కలిసి సౌత్ అమెరికా మొత్తాన్ని బైక్ పై తిరిగిన అల్బెర్టో గ్రెనడోస్ కూడా ఈ జాబితాలో చేరారు. కాగా.. చే గువేరా, తన ప్రసంగాలతో యువతను మేల్కొల్పాడు. ఇప్పటికీ యూత్ ఆయనను అనుకరిస్తూ ఉంటారు. దోపీడీ విధానంపై ఆయన చేసిన అలుపెరుగని పోరాటమే యువత హృదయాల్లో ఆయన్ని హీరోగా నిలిపింది.

Similar News