దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జులై 1 నుంచి ఆగస్టు 12 వరకు అన్ని రైల్ సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్టు రైల్వే బోర్డు ప్రకటించింది. కరోనా వైరస్ మరింతగా ఉధృతమవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే మే 12 నుంచి నడుస్తున్న ప్రత్యేక రైళ్లు యధావిధిగా కొనసాగుతాయని రైల్వే అధికారులు తెలిపారు. జులై 1 నుంచి ఆగస్టు 12 వరకు బుక్‌చేసుకున్న టిక్కెట్‌లను రిఫండ్ చేస్తామని రైల్వే పేర్కొంది.