వాహనదారులకు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. శుక్రవారం వరుసగా 21వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.. పెట్రోల్ పై లీటర్‌కు 21 పైసలు, డీజిల్ ధర లీటర్‌కు 17 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. పెరిగిన ధరతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు 80.13కు చేరింది, అలాగే డీజిల్ లీటర్‌కు 80.19 రూపాయలకు ఎగబాకింది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 82.96 రూపాయలకు చేరుకుంది. మరోవైపు కరోనా సంక్షభోబంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ప్రజలపై పెట్రో భారాలను మోపడం సరైంది కాదని వినియోగదారులు, ప్రతిపక్ష నేతలు కేంద్రంపై మండిపడుతున్నారు.