టీ కొట్టు యజమాని కూతురు భారత వైమానిక దళంలో..

Update: 2020-06-26 17:40 GMT

ఆడపిల్ల అయితేనేం బాగా చదివిస్తా. ఎంత వరకు చదువుకుంటానంటే అంత వరకు చదివిస్తా.. గొప్ప ప్రయోజకురాలని చేస్తా అని భార్యతో తరచూ అంటూ ఉండేవాడు అంచల్ తండ్రి. తండ్రి ఆశయాలకు తోడు ఆమె కూడా బాగా చదువుకుంది. అందరిలా మామూలు ఉద్యోగం కాకుండా దేశం గర్వించే భారత వైమానిక దళంలో ఉద్యోగాన్ని సాధించింది. మధ్యప్రదేశ్ లోని ఓ టీకొట్టు వ్యాపారి కూతురైన అంచల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ప్లయింగ్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయింది. తండ్రి సురేశ్ గంగ్వాల్ కూతురు సాధించిన విజయానికి ఉప్పొంగిపోతున్నాడు.

అంతకు ముందు లేబర్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహించిన అంచల్ తన ఉద్యోగం పట్ల తనకున్న అంకిత భావంతో సబ్ ఇన్ స్పెక్టర్ స్థాయికి చేరుకుంది. అక్కడ కూడా తన ప్రతిభను కనబరించింది. అక్కడి నుంచి దిండిగల్ ఎయిర్ ఫోర్స్ లో 123 మంది కాడెట్లలో అంచల్ ప్రెసిడెంట్స్ ప్లాక్ సాధించింది. కానీ ఈ సంతోషాన్ని తల్లిదండ్రులతో పంచుకోలేకపోయింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరేడ్ కు అతిధులెవరినీ ఆహ్వానించలేదు. అమ్మానాన్న తన పాసింగ్ అవుట్ పరేడ్ కి హాజరు కాలేకపోయారన్న బాధ ఉన్నా తన కోరిక నెరవేరినందుకు ఆనందించింది.

అధికారులు కూడా ఎవరినీ ఆహ్వానించలేదు. తండ్రి సురేష్ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తన చదువుని మధ్యలోనే ఆపేశాడు. తన ఆశల్ని, తన ఆశయాల్ని కూతురు నెరవేర్చినందుకు ఒకింత గర్వంగా ఫీలవుతున్నాడు. తండ్రి ఆశయాల్ని నెరవేర్చిన కూతురిగా అంచల్ అత్యున్నత శిఖరాలను చేరుకుంటోంది.

Similar News