టిక్ టాక్ స్టార్ సియా కక్కర్ ఆత్మహత్య చేసుకుంది. పట్టుమని పదహారేళ్లు కూడా లేవు. అయినా పాపులర్ అయిపోయింది సియా టిక్ టాక్ ద్వారా. గురువారం ప్రీత్ విహార్ లోని ఆమె నివాసంలో బలవన్మరణానికి పాల్పడింది. ఆమె వ్యక్తిగత మేనేజర్ అర్జున్ అధికారికంగా ధృవీకరించారు. అద్భుత ప్రతిభ కలిగిన సియా ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అర్థం కావట్లేదన్నారు మేనేజర్ అర్జున్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సియా ఫాలోవర్స్ ని తన మాటల ద్వారా డ్యాన్స్ ద్వారా ఎంటర్ టైన్ చేస్తుంటారు. సియాకు ఇన్ స్టాలో 104కే ఫాలోవర్స్ ఉంటే.. ఇక టిక్ టాక్ లో అయితే చెప్పక్కర్లేదు 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సియా ఆత్మహత్య వార్త టిక్ టాక్ యూజర్లను షాక్ కు గురిచేసింది. అయితే ఆమె ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.