దేశంలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకీ పెరుగుతున్న పాజిటివ్ కేసులతో.. ప్రజలు ఆందోళనకు గురవతున్నారు. ఒక్కరోజులోనే 33 మంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) జవాన్లకు కరోనా సోకింది.
33 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో బీఎస్ఎఫ్ లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 944కు చేరింది. ఇందులో 637 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 5,29,421 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 16,103 మంది ప్రాణాలు కోల్పోయారు.